ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-04-30 14:00:16.0  )
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా.. భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ రాకుండా ప్రధాని మోడీ అడ్డుకున్నారని, హామీలు గురించి అడిగితే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. అలాగే దేశంలో మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని.. దీని కోసమే బీజేపీని 400 సీట్లలో గెలిపించాలని అడుగుతుందని అన్నారు. అలాగే గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులను పంపించారని.. నన్ను అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశాంచారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More...

పోలీసులను కాదు.. సైనికులను తెచ్చుకో.. నోటీసులపై సీఎం రేవంత్ షాకింగ్స్ కామెంట్స్

Advertisement

Next Story