- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: "కారు" స్టీరింగ్ "చేతి" లో ఉందని తెలుసు.. టీ బీజేపీ సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: కారు(CAR) స్టీరింగ్ చేతి(Hand) లో ఉందని అందరికీ తెలుస్తూనే ఉందని, మీ రెండు పార్టీల ఆటల్ని కట్టించేది బీజేపీయేనని బీజేపీ తెలంగాణ(BJP Telangana) సంచలన ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా 2024 కు ముందు, 2024 కు తర్వాత అని ఆసక్తికర ఫోటోను పోస్ట్ చేసింది. దీనిపై బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్నప్పుడు, ఓటుకు నోటు కేసు(Note For Vote) గతి ఏమయిందో తెలుసని, కాంగ్రెస్(Telangana Congress) అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Taping Case) ఏమైతుందో అందరికీ తెలుసని అన్నది. అలాగే కాళేశ్వరం(Kaleshwaram) దొంగను చెర్లపల్లి(Cherlapalli)లో పెడతా అని ఒకడు గెలిస్తే.. మూసి(Moosi) సుందరీకరణ దొంగను అంతు చూస్తా అని ఒకడు అనవట్టె! అని, పైకి ఒకళ్ళను ఒకళ్ళు గిచ్చుకున్నట్టు చేస్తరు, కానీ నిజానికి మీవి గిల్లికజ్జాలు అని ప్రజలకు తెలుసు! అని విమర్శలు చేసింది.
అంతేగాక బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి కాంగ్రెస్ వాళ్లను పిలిచి మంత్రి పదవులు ఇచ్చింది చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి బీఆర్ఎస్ ఎంతమంది ఎమ్మెల్యేలను పంపించిందో చూశామని వ్యాఖ్యానించింది. ఓ ఆదివాసీ ఆడబిడ్డను రాష్ట్రపతి(President Of India) అవ్వకుండా ఆపేందుకు చెయ్యి పార్టీ కారు పార్టీతో చేతులు కలపడం దేశమంతా చూసి ఛీ కొట్టిన విషయం మర్చిపోయావా? అని, ఉపరాష్ట్రపతిని ఓడించడానికి భుజం భుజం కలిపిన సంగతి మరిచిపోయావా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆఖిరికి తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడిని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే ఎన్నుకున్నారు కదా! అని, లాభాల కోసం, లావాదేవీల కోసం ఎవరు ఎవరితో కుమ్మక్కై లిక్కర్ దందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిర్రో అందరికి తెలుసని, దందాల్లో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ చెల్లి తరఫున కోర్టులో ఏ కాంగ్రెస్ నాయకుడు వాదించాడో అందరికి తెలుసని దుయ్యబట్టింది. అందుకే కారు స్టీరింగ్ పైలంగా చేతిలోనే ఉంది! అని, మీ రెండు పార్టీల ఆటల్ని కట్టించేది.. మీ కట్టు కథల్ని బట్టబయలు చేసేది బీజేపీ కాబట్టే మీ ఏడుపులు, పెడ బొబ్బలు అని ఎక్స్ లో రాసుకొచ్చింది.