- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లంచ్ మోషన్ వేయనున్న బీజేపీ
దిశ, కరీంనగర్ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రపై ఉత్కంఠ అలాగే నెలకొని ఉంది. కోర్టు అనుమతిస్తేనే ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. పాదయాత్ర అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామన్న బీజేపీ సమాయత్తం అవుతోంది. ఆదివారం అర్థరాత్రి హౌజ్ మోషన్ పిటిషన్ వేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల పిటిషన్ దాఖలు చేయలేక పోయారు. సోమవారం ఉదయం లంచ్ మోషన్ తో పాటు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని చూస్తున్నారు. ఈ విషయంపై కోర్టులో దాఖలు చేయాల్సిన పిటిషన్, ఇతరాత్ర అంశాలపై బండి సంజయ్ న్యాయ నిపుణులతో చర్చించారు. సీనియర్ న్యాయవాదులు పిటిషన్ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తు చేయనున్నారు. కోర్ట్ ఆదేశాలు వచ్చే వరకు కరీంనగర్ ఇంట్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉండనున్నారు. ఈ సందర్భంగా తన నివాసం వద్దే కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని సమాచారం.
భారీ బందోబస్తు
కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఎంపీ బండి సంజయ్ ఇంటివద్ద పోలీసు బలగాలు మోహరించాయి. ఆదివారం అర్థరాత్రి నుండి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సంజయ్ బయటకు వెళ్తే నిలువరించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే బీఎస్కే మాత్రం కోర్టు ఆదేశాల కోసం వేచి చూడాలని భావిస్తున్నారు.