పని చేయండి.. లేదంటే వేటు తప్పదు: BJP State Chief Kishan Reddy వార్నింగ్

by Satheesh |   ( Updated:2023-07-22 16:45:18.0  )
పని చేయండి.. లేదంటే వేటు తప్పదు: BJP State Chief Kishan Reddy  వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ అనుబంధ మోర్చాలు నిత్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని, లేదంటే వేటు తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం కిషన్ రెడ్డి తొలిసారిగా అన్ని మోర్చాల అధ్యక్షులతో శనివారం నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌పై వారికి దిశానిర్దేశం చేశారు. కాగా పలు మోర్చాలు అసలు ఏమాత్రం పనిచేయడం లేదని, ఏదో కార్యక్రమం చేశామని చేతులు దులుపుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారాలని కిషన్ రెడ్డి వారికి ఆదేశించినట్లు తెలుస్తోంది. లేదంటే వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం.

Advertisement

Next Story