BJP: రాజకీయ నాయకులు చేసుకునేది రైతు పండుగ కాదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Ramesh Goud |
BJP: రాజకీయ నాయకులు చేసుకునేది రైతు పండుగ కాదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: రైతు పండగంటే రాజకీయ నాయకులు చేసుకునేది కాదని, రైతులంతా కలిసి చేసుకోవాలని చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy) అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనను(Congress Governance) విమర్శిస్తూ.. బీజేపీ(BJP) ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ రైతు పండుగ పేరుతో వేడుకలు జరుపుకున్నదని, రైతులు(Formers) చేసుకుంటే రైతు పండుగ అంటారని, రాజకీయ నాయకులు(Political Leaders) చేసుకునేది రైతు పండుగ ఎలా అవుతుందని, రైతుల ఇళ్లలో దుఖం ఉంటే మీరు పండుగ ఎలా చేసుకుంటారని విమర్శలు చేశారు.

కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయ్యిందని, గత డిసెంబర్ లో చేస్తామని మాట ఇచ్చి, మళ్లీ డిసెంబర్ వచ్చినా 50 శాతం కూడా కాలేదని చెప్పారు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తా అని చెప్పి ఆంక్షలు పెట్టి అందులో కూడా ఫెయిల్ అయ్యారని, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఎక్కడ పోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతాంగం అంతా ఇంతో నడుస్తుందంటే దానికి కారణం మోడీ ప్రభుత్వమేనని(Modi Govt), 25 వేల కోట్లతో ఒడ్లు కొంటున్నదని, 90 శాతం సబ్సీడీతో యూరియా ఇస్తుందని అన్నారు. మళ్లీ కేంద్రం ఏం చేయట్లేదని విమర్శలు చేస్తారని, రైతులకు కాంగ్రెస్ ఏం చేయట్లేదని, చేసిందంతా మోడీ ప్రభుత్వమేనని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story