- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి బీజేపీ పార్లమెంట్ సెగ్మెంట్ సమావేశాలు
దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి బీజేపీ పార్లమెంట్ సెగ్మెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టనున్నారు. ఆదివారం నుంచి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో నియోజకవర్గస్థాయి విసృత సమావేశాలు బీజేపీ నిర్వహించనుంది. ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ లో జరిగే సమావేశానికి దాదాపు 3 వేల మంది నాయకులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పై బీజేపీ సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ను దక్కించుకోవాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఓల్డ్ సిటీ లో బీజేపీ శ్రేణులు సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు. అలాగే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సమీక్ష జరిపి పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలపై చర్చించనున్నారు
కేంద్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు మీడియా, సోషల్ మీడియా ప్రాధాన్యత, స్థానిక సమస్యలు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై లోతుగా చర్చించే అవకాశాలున్నాయి. మకూఅనంతరం రాబోయే కాలానికి ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ లో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై యాక్షన్ ప్లాన్ ను రూపొందిస్తారు.