BJP MLA: నేనే రియల్ పుష్ప.. ఎర్రచందనం ఎగుమతి చేశా.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

by Ramesh N |   ( Updated:2024-12-30 10:31:10.0  )
BJP MLA: నేనే రియల్ పుష్ప.. ఎర్రచందనం ఎగుమతి చేశా.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశావ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు‌అర్జున్ (AlluArjun) నటించిన (Pushpa) పుష్ప సినిమా, సంధ్య థియేటర్ ఘటన‌పై చర్చజరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (BJP MLA Paidi Rakesh Reddy) సంచలన కామెంట్స్ చేశారు. నేనే రియల్ పుష్ప.. అని బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లీగల్‌గా ఎర్రచందనం ఎగుమతి చేసినట్లు తెలిపారు. ఎర్రచందనం అమ్మినోడు.. కొన్నవాడు కూడా పుష్పానే అంటూ వ్యాఖ్యానించారు.

అదేవిధంగా (Telangana BJP) తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్‌‌పై స్పందించారు. సంక్రాంతి తరువాత తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని జోస్యం చెప్పారు. బాహుబలి 1 లో అధ్యక్షుడికి 3 ఏళ్లు టైమ్ ఇస్తామన్నారు. బాహుబలి పార్ట్ 1 లో మంచిగా చేస్తేనే బాహుబలి 2 లోకి తీసుకుంటామని చెప్పారు. బాహుబలి పార్ట్ 1 లో మంచిగా చేయకపోతే బాహుబలి పార్టు 2 లో మార్చేస్తామని సెటైర్లు వేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఎన్నికల సమయంలో తనను ఇంఛార్జీగా నియమించాలని అడుతున్నట్లు తెలిపారు. ఆ 3 జిల్లాల్లో 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తానని వెల్లడించారు.

Next Story

Most Viewed