కేసీఆర్ ఆరోగ్యంపై విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు

by GSrikanth |
కేసీఆర్ ఆరోగ్యంపై విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై సినీ నటి, బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా నుండి తప్పించుకొని, సమాధానం వెతుక్కునే ప్రయత్నానికి సమయం కోసం నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకూ కేసీఆర్ హాస్పిటల్‌లో చేరి ఉంటారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారని విజయశాంతి చురకలు అంటించారు.

‘ఇంత జరిగినా, నా కుటుంబ సభ్యులెవ్వరికీ ఢిల్లీ లిక్కర్ స్కాంతో గానీ, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంకే అవినీతితో గానీ, ఏ విధమైన సంబంధం లేదని, నేను నిప్పులాంటి నిజాయితీ నేతను, ఆరోపణలు నిజమైతే రాజకీయాల నుంచి మా కుటుంబమంతా వైదొలుగుతాం’ అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నరు కేసీఆర్ అంటూ విజయశాంతి ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed