- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్యోతిష్యుడు చెప్పినందుకే పార్టీ పేరు మార్పు: లక్ష్మణ్
దిశ, తెలంగాణ బ్యూరో: జ్యోతిష్యులు చెప్పడం వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్‌గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు అక్రమ సంపాదనపై ఆశలెక్కువని, వాటిని నిలుపుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌తో జాతీయ స్థాయిలో దోపిడీకి ఆయన ప్లాన్ చేశారని లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ రద్దు చేయడం మాత్రమే కేసీఆర్ చేతిలో ఉందని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఈసీ నిర్ణయమని స్పష్టం చేశారు. కర్ణాటకతో పాటు.. ఎన్నికలు జరపటానికి ఈసీ కేసీఆర్ జేబు సంస్థ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జమిలీ ఎన్నికలే బీజేపీ విధానంగా ఆయన చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ తీరుతో తెలంగాణ రాష్ట్రం నష్టపోతోందని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం కేంద్రంతో కేసీఆర్ సఖ్యతగా ఉండాలని సూచనలు చేశారు. ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్ ఎవరకీ ప్రోటోకాల్ పాటించని వ్యక్తి కేసీఆర్ అని విమర్శలు చేశారు. కేంద్రం నిధులకు లెక్క పత్రం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తొండి ఆటలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మెట్రో అనడం అవాస్తవమని కొట్టిపారేశారు. మజ్లిస్ కోసమే 16 కిలోమీటర్ల మెట్రో రైల్ 32 కిలోమీటర్ల దూరం పెరిగేలా చేశారని ఫైరయ్యారు. ఎస్పీ, డీఎంకే, బీఎస్పీ, టీడీపీ, టీఎంసీలు కూడా జాతీయ పార్టీలేనని, బీఆర్ఎస్ పెట్టినంత మాత్రాన తమకు వచ్చే నష్టమేమీలేదన్నారు. పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ విలువ తీశారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
READ MORE