బీజీపీ అంటేనే మతతత్వ పార్టీ, మాదిగలు ఎలా సపోర్ట్ చేస్తారు: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

by Shiva |
బీజీపీ అంటేనే మతతత్వ పార్టీ, మాదిగలు ఎలా సపోర్ట్ చేస్తారు: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్‌లో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి మాదిగలు ఎలా సపోర్టు చేస్తారంటూ ప్రశ్నించారు. మంద క్రిష్ణ మాదిగను అడ్డుపెట్టుకుని బీజేపీ గేమ్ ఆడుతుందని అన్నారు. ఆయన కూడా సొంత ప్రయోజనాల కోసం మాదిగలను రెచ్చకొడుతున్నారని మండిపడ్డారు. మంద కృష్ణను కేసీఆర్ జైల్లో పెడితే ఆదుకున్నది ఎవరో అంటూ ఫైర్ అయ్యారు.

దళితులంతా కాంగ్రెస్ వెంటే ఉంటారని.. ఉన్నారని స్పష్టం చేశారు. 1994 నుంచి మాదిగల కోసం నిజాయితీగా మంద కృష్ణ ఏనాడు పోరాడలేదని గుర్తు చేశారు. అన్ని పరిణామాలను మంద కృష్ణ తనకు అనుకూలంగా మార్చుకున్నాడని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎందుకు రిజర్వేషన్‌పై పార్లమెంట్‌లో బిల్లు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాల‌ను నీరుగార్చేలా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతున్నారని తెలిపారు. వర్గీకరణ ఖచ్చితంగా కాంగ్రెస్‌కే సాధ్యమని అన్నారు. మంద కృష్ణ మాదిగ లాగా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రెచ్చగొట్టే విధానం కాంగ్రెస్ పార్టీలో ఏనాడు లేదన్నారు.

Advertisement

Next Story