గోషామహల్ బీజేపీ అభ్యర్థి నేనే: MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-08-21 13:41:35.0  )
గోషామహల్ బీజేపీ అభ్యర్థి నేనే: MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్‌లో సీట్ కన్ఫార్మ్ చేసేది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని, ఎంఐఎం పార్టీ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించిన లిస్ట్‌పై స్పందించారు. దాదాపు అన్ని సెగ్మెంట్లకు క్యాండెట్లను డిక్లేర్ చేశారని, కానీ కొన్ని నియోజకవర్గాలకు క్యాండెట్లను నియమించలేదని చెప్పారు. అందులో ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గం ఉందని, అయితే ఆ ఎమ్మెల్యే సీటు డిక్లేర్ చేసేది కేసీఆర్ కాదన్నారు.

ఎంఐఎం పార్టీ అని విమర్శించారు. 2018 ఎన్నికల్లో కూడా ఈ విధంగానే జరిగిందని చెప్పారు. ఎంఐఎం క్యాండెట్ ప్రేమ్ సింగ్ రాథోడ్‌ని బీఆర్ఎస్ కాకుండా ఎంఐఎం వారే డిసైడ్ చేసి పెట్టారని గుర్తుచేశారు. తనను ఓడించడానికి చాలా వరకు డబ్బులు ఖర్చు చేశారని ఆరోపించారు. కానీ తను గెలిచాడని, నెక్ట్స్ కూడా బీజేపీ నుంచి క్యాండెట్ తానే ఉంటానని చెప్పారు. బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉందని, గోషామహాల్ ప్రజలు సిద్ధంగా ఉండాలని, యుద్ధం మొదలైందన్నారు.

Advertisement

Next Story