- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA లాస్య నందిత కేసులో BIG ట్విస్ట్.. అతడే కారణమంటున్న కుటుంబసభ్యులు
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని పఠాన్‌చెరు సమీపంలోని ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించారు. తాజాగా.. ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో పోలీసులు ఇప్పటికే కీలక విషయాలు వెల్లడించారు. తాజాగా.. ఆమె కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. లాస్య నందిత మరణానికి ఆమె పీఏ, డ్రైవర్ ఆకాశే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. పటాన్ చెరు నుంచి ఆకాశ్ బలవంతంగా లాస్యను తీసుకువెళ్లాడని చెబుతున్నారు.
ఈ మేరకు ఆకాశ్‌పై పోలీసులకు లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. పటాన్ చెరు పోలీసులు ఆకాశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఆకాశ్ కారును నిర్లక్ష్యంగా నడిపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆకాశ్ నుంచి ఇప్పటికే పటాన్‌చెరు పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తనకు అర్థం అవ్వట్లేదంటూ ఆకాశ్ చెప్పాడు. లాస్య అల్పాహారం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లామని వివరించాడు.