- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో బిగ్ షాక్.. భారీగా జరిమానా విధింపు

X
దిశ, వెబ్ డెస్క్ : వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్(MLA Chennamaneni Ramesh,)కు హైకోర్టు(Telangana High Court) బిగ్ షాక్ ఇచ్చింది. పౌరసత్వం కేసులో రమేష్ చేసిన పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడి(German citizen)గా తీర్పు ఇచ్చింది. ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని హైకోర్టు వెల్లడించింది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి(Justice B. Vijaysen Reddy) ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు గాను చెన్నమనేని రమేష్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. దాంతో పాటు చెన్నమనేనికి రూ.30 లక్షల భారీ జరిమానా విధించింది. అందులో నుంచి ఆది శ్రీనివాస్‌కు రూ. 25 లక్షలు, లీగల్ సర్వీస్ అథారిటీకి రూ.5 లక్షలు నెలరోజుల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Next Story