- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Graduate MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ !

దిశ, వెబ్ డెస్క్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC Elections)ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి బిగ్ షాక్ (Big Shock)తగిలింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్ అభ్యర్థి (Congress Rebel Candidate) నామినేషన్ దాఖలు(Filing Of Nomination)చేయడం ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురా(Adilabad Congress District President)లు మంచికట్ల ఆశమ్మ(Manchikatla Asamma)ఈ స్థానంలో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం విదితమే. మరోవైపు తన సిట్టింగ్ స్థానంలో తనను కాదని మరోకరిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా బరిలో ఉంటారని అంటున్నారు. అయితే 2018లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నరేందర్ రెడ్డి 2018లో కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసే ఉద్దేశంతో నియోజకవర్గం పరిధిలో 1.5లక్షల ఓట్లను ఆయన ఎన్ రోల్ చేశారని చెబుతున్నారు. అటు నిజమాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాలతో పాటు వరంగల్ ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా నామినేషన్ల స్వీకరణ ఘట్టం కొనసాగుతోంది. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 12న అభ్యంతరాలు, 13న ఉపసంహరణ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఘట్టం సాగనుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలకు గ్రాడ్యుయేట్ స్థానం, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం నియోజక వర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.