సుప్రీంకోర్టులో BRS MLC కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్

by GSrikanth |   ( Updated:2023-03-15 06:22:55.0  )
సుప్రీంకోర్టులో BRS MLC కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుక్కెదురైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనను ఈడీ కార్యాయంలో విచారణకు హాజరుకావాలని జారీ చేసిన ఈడీ నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం ఎమ్మెల్సీ కవిత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయానికి ఒక మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను విచారణ కోసం పిలుస్తోందని, ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. కవిత పిటిషన్‌ను స్వీకరించిన సీజేఐ.. వెంటనే విచారించేందుకు నిరాకరించారు. ఈనెల 16న కవిత విచారణపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈనెల 24న కవిత పిటిషన్‌పై వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, రేపు(మార్చి 16) రెండోసారి ఈడీ విచారణకు హాజరుకావాలని అధికారులు ఆమెను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కవిత బుధవారం ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సమావేశంలో కవితతో పాటు, ప్రతిపక్ష మహిళా నేతలు, పలు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. మరోవైపు, రేపు ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు కవిత హాజరు కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed