BIG News: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 1,284 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

by Shiva |   ( Updated:2024-09-12 04:03:26.0  )
BIG News: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 1,284 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు గాను తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో 1,088, వైద్య విధాన పరిషత్ పరిధిలో 183 అదేవిధంగా ఎం అండ్ జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో 13 ఉద్యోగాలను పూర్తిగా చేయనున్నారు. కాగా ఈ పోస్టులకు గాను 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. నవంబర్ 10న సీబీటీ విధానంలో పరీక్షను నిర్వహించనున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.





Advertisement

Next Story

Most Viewed