బీసీ రుణాల ద‌ర‌ఖాస్తు వెబ్‌సైట్‌లో బిగ్ మిస్టేక్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-14 06:36:24.0  )
బీసీ రుణాల ద‌ర‌ఖాస్తు వెబ్‌సైట్‌లో బిగ్ మిస్టేక్
X

దిశ, బయ్యారం : ఎన్నిక‌ల ఏజెండాతో బీసీ కుల వృత్తుల‌దారుల‌కు 100శాతం స‌బ్సిడీతో రుణాల‌ను అంద‌జేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ‌ను స్టార్ట్ చేసింది. ఒక్కో మండ‌లంలో వేలాది మంది ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. మీ సేవ కేంద్రాలు కిట‌కిట‌లాడుతున్నాయి. అయితే ల‌క్షలాది మంది బీసీ కుల‌స్తులు ఎంతో ఆశ‌తో చేసుకుంటున్న ద‌ర‌ఖాస్తుల విష‌యంలో అధికారుల పొర‌పాట్లు, లోప‌బూయిష్టంగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా మ‌హ‌బూబాబాద్ జిల్లా బ‌య్యారం మండ‌లమే ఆన్‌లైన్‌లో క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మనార్హం. బ‌య్యారం మండ‌లాన్ని మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిపి చూపిస్తుండ‌టంతో ద‌ర‌ఖాస్తుదారులు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. ఈ విష‌యాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స‌రైన మార్గదర్శకాలు ఇవ్వక‌పోవ‌డంతో కింది స్థాయి అధికారులకు ఏం చేయాలో అర్థం కావ‌డం లేద‌ని స‌మాచారం. బీసీల‌కు రూ.లక్ష రుణం కోసం జనం పెద్ద ఎత్తున కులం, ఆదాయ దృవ పత్రాలు తీసుకొని ఆన్ లైన్ మీ సేవ సెంట్లర్ల వద్ద గత నాలుగు రోజులు నమోదు కోసం క్యూలు కడుతున్నారు.

మీసేవ నిర్వహకులు తెలిసిన సమాచారం ద్వారా బిసి కులస్తులు రుణం మంజూరీకి వెబ్ సైట్ ఇల్లందు నియోజకవర్గంను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంథ‌ని నియోజక వర్గంలో అంత‌ర్భాగ మండ‌లంగా బ‌య్యారంను చూపెడుతోంది. దీనిపై మండల తహసీల్దార్ అనంతుల రమేష్‌ను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై మండల ఎంపీడీవోను సంప్రదించాలని అన్నారు. దీనిపై మండల ఎంపీడీవో చలపతి రావును ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్విచ్ఛాఫ్‌ అని రావడం గమనార్హం.

Advertisement

Next Story