- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్ : భార్య ఆత్మహత్య చేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్సై
దిశ, వరంగల్ బ్యూరో/ జనగామ: భార్య ఆత్మహత్య చేసుకోగా మనస్తాపానికి గురై ఓ ఎస్ ఐ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన జనగామలో పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. జనగామ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్(50) భార్య స్వరూప (42)బాత్రూంలో వెంటిలేటర్‌కు ఉరివేసుకొని మృతి చెందింది. ఆమె మరణంతో చలించిపోయిన ఎస్ఐ వెంటనే తన సర్వీస్ రివాల్వర్‌తో బాత్రూంలో కాల్చుకొని కుప్పకూలిపోయాడు. వాటర్ సిబ్బంది రివాల్వర్ శబ్దం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి జనగామ డీసీపీ సీతారాం ఇతర పోలీస్ అధికారులు చేరుకొని ఎస్సైని వెంటనే జనగామ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికి ఫలితం లేకపోయింది ఆయన ఆసుపత్రిలో మృతి చెందాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య మొదటగా బాత్రూంలో చీరతో ఉరి వేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె మరణాన్ని తట్టుకోలేక క్షణికావేశంలో అదే బాత్రూంలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని మృతి చెందాడు. జనగామ పట్టణ వాసులకు సుపరిచితుడుగా, స్నేహశీలిగా ఎస్ఐ శ్రీనివాస్‌కు మంచి పేరు ఉంది. భార్యాభర్తలు ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో జనగామ పట్టణంతో పాటు, పోలీస్ విభాగంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇటీవల పెద్ద కుమారుడి వివాహం ఎంతో ఘనంగా జరిపించాడు. మృతదేహాలను స్వగ్రామానికి తరలించేందుకు పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియ రాలేదు. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్ స్వగ్రామం బెల్లంపల్లి కాగా, స్వరూప స్వగ్రామం జమ్మికుంట. కొద్దిరోజుల క్రితమే ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా శ్రీనివాస్ పదోన్నతి పొంది జనగామలో విధులు నిర్వహిస్తున్నాడు. ఫ్రెండ్లీ ఆఫీసర్‌గా డిపార్ట్‌మెంట్‌లో శ్రీనివాస్‌కు మంచి పేరు ఉంది. శ్రీనివాస్ ఆత్మహత్యతో డిపార్ట్‌మెంట్ వర్గాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.
Read more:
బ్రేకప్ చెప్పిన ప్రేయసి కోసం తీవ్ర వర్షంలో 21 గంటలు.. మోకాళ్లపై కూర్చొని వెయిటింగ్..