- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం.. నటి హేమకు బిగ్ షాక్
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. అయితే, ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1,086 పేజీల ఛార్జ్‌షీట్‌ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. అయితే, కేసులో నెక్ట్స్ ఏం జరగబోతోందనేది సస్పెన్స్‌గా మారింది.
కాగా, కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగంతో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాయింపునివ్వాలని ఆమె బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన చార్జ్‌షీట్‌పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హేమ ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇరు పక్షాల వాదోపవాదలు విన్న ధర్మాసనం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉండగా బెయిల్ మంజూరు అవ్వడంతో శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలైంది.