- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో బెంగాల్ ప్లాన్.. అధికారం దిశగా భారీ వ్యూహం
దిశ, తెలంగాణ బ్యూరో: పశ్చిమబెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలోనూ బీజేపీ అమలు చేయనున్నది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల బలమే ఉన్నా రానున్న ఎన్నికల్లో పవర్‌లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నెల చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు రానున్నారు. వచ్చే నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అమిత్ షా రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేయనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా రివ్యూ చేసి ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ ఏడాది చివరి నుంచి రాష్ట్రంపై అమిత్ షా పూర్తి టైమ్ వెచ్చించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడంపై పార్టీలో ఆలోచనలు జరుగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో గెలుపు బీజేపీకి కొత్త ఉత్తేజాన్నిచ్చింది. తెలంగాణలో గెలుపునకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అధినాయకత్వం భావిస్తున్నది. పార్టీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా తరుణ్ చుగ్ ఉన్నప్పటికీ ఆయన కింద పనిచేసేలా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కన్వీనర్లను కూడా నియమించాలనుకుంటున్నది. ఏపీ, తెలంగాణకు సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందినవారినే ఇక్కడ పెట్టాలనుకుంటున్నది. ఈ నెల 25-28 తేదీల మధ్య జేపీ నడ్డా హైదరాబాద్‌కు వచ్చి పార్టీ రాష్ట్రస్థాయి నేతలు, సీనియర్ లీడర్లతో సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణను సైతం రూపొందించనున్నారు. వచ్చే నెల 14న అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఏడాది చివరి నుంచి వీలైనన్ని ఎక్కువ రోజులు అమిత్ షా ఇక్కడే గడిపేలా పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం ప్లాన్ చేస్తున్నది. నగరంలోనే ఒక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై ఢిల్లీ కేంద్ర కార్యాలయ స్థాయిలో ప్రాథమిక ప్లాన్ రూపుదిద్దుకున్నది.
ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలో పార్టీ విస్తరణ కార్యకలాపాలను ఊపందుకోనున్నాయి. కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు ఇకపైన తరచూ తెలంగాణను విజిట్ చేసి పార్టీ కార్యకలాపాలతో పాటు బహిరంగసభలు, గ్రామాల్లో పర్యటనల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలికిన పార్టీగా ప్రజల్లో మరింత లోతుగా చొచ్చుకుపోవాలని భావిస్తున్నది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయినందున 'తెలంగాణ ఇచ్చిన రాష్ట్రం' అనే సెంటిమెంట్ వర్కవుట్ అయ్య అవకాశం లేదన్న అభిప్రాయంతో ఉన్నది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ సైతం తాజా ఫలితాలతో డీలా పడిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా వారిని తమవైపు తిప్పుకోవాలని బిజేపీ అధినాయకత్వం భావిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామస్థాయి కార్యకర్తల మొదలు రాష్ట్రస్థాయి నాయకుల వరకు చేర్చుకోవడంపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నది. స్టేట్ లెవల్ లీడర్లను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత డీమోరల్ చేయవచ్చు అనే ఆలోచనలో ఉన్నది. ఇప్పటికే జిల్లాలవారీగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న నాయకులపై దృష్టి పెట్టింది. కొద్దిమందితో తొలి దఫా సంప్రదింపులను పూర్తిచేసింది. సరైన సమయం చూసుకొని లాంఛనంగా పార్టీలో చేర్చుకోవడమే తరువాయి. వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఒకే కుటుంబం నుంచి ఒకరికంటే ఎక్కువగా ఉన్న పలువురు సీనియర్ నేతలు వచ్చి చేరుతారని బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకత్వం మధ్యలో ప్రచారం జరుగుతున్నది. జేపీ నడ్డా, అమిత్ షా టూర్‌ల తర్వాత పార్టీలో గణనీయమైన మార్పులు జరుగుతాయని, సంస్థాగతంగానూ పార్టీ నిర్మాణం విస్తృతమవుతుందని ఢిల్లీ వర్గాల సమాచారం.