బీ అలర్ట్ : విదేశీ నంబర్స్‌తో ఫోన్ కాల్స్.. లిఫ్ట్ చేస్తే అంతే సంగతులు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-09 06:04:41.0  )
బీ అలర్ట్ : విదేశీ నంబర్స్‌తో ఫోన్ కాల్స్.. లిఫ్ట్ చేస్తే అంతే సంగతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తరచూ వాట్సాప్ నంబర్స్‌కు విదేశీ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. కాల్స్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు అమయాకులను మాటల్లోకి దించుతున్నారు. పొరపాటున కూడా కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇండియన్స్‌పై విదేశాల నుంచి వాట్సాప్ కాల్స్‌తో సైబర్ కేటుగాళ్లు దండయాత్ర చేస్తున్నారు. అమ్మాయిల ప్రొఫైల్ పిక్ ఉంచి నిరంతరం కాల్స్ చేస్తున్నారు. ఆడియో, వీడియో కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కాల్ లిఫ్ట్ చేస్తే అంతే సంగతుల అని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. అకౌంట్ లూటీతో పాటు, దుండగులు బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

Read more:

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే?

Advertisement

Next Story