- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల ర్యాంకుల పంట
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది 2022-23 ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిభా పూలే బీసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి తమ సత్తాను చాటారు. వందల సంఖ్యలో విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించి ఫలితాల్లో ప్రభంజనం కొనసాగిస్తున్నారు. సీనియర్ ఇంటర్ లో 44మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించగా.. ఆరు కాలేజీలు వంద శాతం ఉత్తీర్ణతతో సహా సీనియర్ ఇంటర్ లో 86.67ఉత్తీర్ణతా శాతం సాధించాయి. జూనియర్ ఇంటర్ లో 301 మంది విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించగా.. మూడు కాలేజీలు వందశాతం ఉత్తీర్ణతా సాధించాయి. జూనియర్ ఇంటర్ లో 78.78 ఉత్తీర్ణత శాతం సాధించారు.
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు 8,527 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 8516 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 7,381 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ..5,812 మంది ఏ గ్రేడ్,1225 మంది బీ గ్రేడ్ ,301 మంది సీ గ్రేడ్, 43 మంది విద్యార్ధులు డీ గ్రేడ్సాధించారు. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 8,434 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వీరిలో 8,425 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,637మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 4135 మంది ఏ గ్రేడ్ ,1695 మంది బీ గ్రేడ్, 604 మంది సీ గ్రేడ్ ,203 మంది విద్యార్థులు డీ గ్రేడ్ పొందారు.
సెకండ్ ఇయర్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు..
ఎంపీసీ లో 4వ ర్యాంక్ శ్రీజ, ఖానాపూర్ (991 మార్కులు),5వ ర్యాంక్ కె. మహేశ్, చిట్యాల( 990 మార్కులు) సాధించగా మరో 33మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. ఇక బైపీసీలో సంగారెడ్డి కాలేజీ విద్యార్థులు 6వ ర్యాంక్ పల్లవి, (989 మార్కులు), 7వ ర్యాంకు నందిని, (988 మార్కులు)సాధించారు. మరో 9మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. కల్వకుర్తికి చెందిన అనిత ఎంఈసీ లో 981 మార్కులతో 8వ ర్యాంక్ సాధించింది. ఖానాపూర్‌కు చెందిన దీక్షిత సీఈసీ లో 977 మార్కులతో 8వ ర్యాంక్, రామగుండానికి చెందిన అభి సాత్విక, 976 మార్కులతో 9వ ర్యాంకు సాధించారు.
ఫస్ట్ ఇయర్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు..
మందమర్రికి చెందిన హరితకు ఎంపీసీలో 1 వ ర్యాంకు (468 మార్కులు), రెండవ ర్యాంకు 467 మార్కులతో భూమిక, కీర్తిలు ఇద్దరు విద్యార్థులు సాధించారు. వీరితో పాటు 230మంది పది లోపు ర్యాంకులు సాధించారు. వరంగల్‌కు చెందిన రిషిత బైపీసీలో 4 వ ర్యాంక్ (435 మార్కులు),5వ ర్యాంక్ లో 434 మార్కులతో పది మంది విద్యార్థులు నిలిచారు.ఓవరల్‌గా55మంది విద్యార్థులు పది లోపు ర్యాంకు సాధించారు. ఇక ఎంఈసీలో 492 మార్కులతో స్వప్ప, మధులతలు 4వ ర్యాంక్ లు సాధించగా.. పది మంది విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. 489 మార్కులతో హెచ్ ఈసీలో నాగరాణి ఫస్ట్ ర్యాంక్ ,488 మార్కులతో నాగ త్రిష 2వ ర్యాంకు సాధించారు.488 మార్కులతో సీఈసీలో ప్రవల్లిక 5వ ర్యాంక్ తో పాటు మరో ఏడు మంది విద్యార్ధులు పది లోపు ర్యాంకులు సాధించారు.
విద్యార్థులు, టీచర్లకు మంత్రి గంగుల అభినందనలు
ఇంటర్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు సాధించిన ప్రతిభను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.పేద బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ గురుకుల విద్యాసంస్థలను ఇంటర్మీడియెట్ వరకు అప్ గ్రేడ్ చేసిందన్నారు.గతంలో లో ఉన్న 19 జూనియర్ కాలేజీల సంఖ్యను 142కు పెంచడంతో వేలాది మంది విద్యార్థులు చదువుకుని తమ జీవితాలను చక్కదిద్దుకునేందుకు మార్గం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు అభినందించారు.ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటూ బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు విద్యార్థులను అభినందించారు.