BC Commission: బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం

by Ramesh Goud |
BC Commission: బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్తగా ఎన్నికైన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ సహా ముగ్గురు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నాయకుల సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాష్ట్ర వెనుకబడిన తరగతుల(బీసీ) కమిషన్ కు నూతన చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత జీ. నిరంజన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులుగా ఎన్నికైన రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి గౌడ్ లు బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందో దానిని నెరవేర్చుతామని, అన్ని కుల సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని, కమిషన్ ను ఎవరైనా, ఎప్పుడైనా కలవచ్చని తెలిపారు. కాగా కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు చేపడతామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు కొత్త బీసీ కమిషన్ ను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త కమిషన్ చైర్మన్, సహా మరో ముగ్గురు సభ్యుల పేర్లను ఖరారు చేయడంతో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed