BC Commission: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కులగణనపై బీసీ కమిషన్ కొత్త చైర్మన్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
BC Commission: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కులగణనపై బీసీ కమిషన్ కొత్త చైర్మన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం వేడెక్కుతున్నది. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో బీసీ కమిషన్ కొత్త చైర్మన్ గా నియమితులైన నిరంజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే బీసీ కులగణన చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శనివారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన సమాజ శ్రేయస్సు తన ప్రధాన ఎజెండా అని, సమాజంలో శ్రేయస్సు ఉండాలంటే జనాభాలో మెజారిటీ ఉన్న బీసీలు తమ వాటా కావాలని కోరుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ సైతం చేస్తున్నారని, రాష్ట్రంలో కులగణన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చెప్పారు. ఆ లక్ష్యం దిశగా బీసీ కమిషన్ పని చేస్తుందన్నారు. గత బీసీ కమిషన్ కులగణన విషయంలో ఎంత మేరకు పని చేసిందో వివరాలు తెప్పించుకుని వాటిని పరిశీలించి తామెంత త్వరలో పూర్తి చేయగలమో చేస్తామన్నారు. అన్ని బీసీ కుల సంఘాలు సహకరిస్తే ఎన్నికల లోపే కులగణన జరగకపోవడం అనేది ఉండదని అందువల్ల బీసీ సంఘాలు ఆందోళన బాటలో కాకుండా సహకారం బాటలో ఉండాలని కోరారు. బీసీ కుల సంఘాలు ఆందోళన పడాల్సిన అవసరం గానీ ఆందోళన చేయాల్సిన అవసరం గాని లేదన్నారు. కులగణన విషయంలో బీసీ కమిషన్ కు ఏ విధంగా సహకరించాలో అనే దృక్ఫథంతో ఆలోచన చేయాలన్నారు.

Advertisement

Next Story