విప్లవ వీరులు గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బట్టి విక్రమార్క

by Indraja |
విప్లవ వీరులు గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బట్టి విక్రమార్క
X

దిశ డైనమిక్ బ్యూరో: పుట్టిన ప్రతి మనిషి ఎదో ఒక రోజు మరణిస్తారు. కానీ మరణించి కూడా ఎవరైతే ప్రజల మనస్సులో భావితరాల మనుగడలో బ్రతికే ఉంటారో వారే అమరులు. అలాంటి అమరులు నూటికో కోటికో ఒకరు పుడతారు. అలా మరణించి కూడా బతికున్న మనుషుల్లో ఒకరే.. దొరల పాలనలో దయనొందిన జీవితాలతో అణగారిన బతుకుల్లో అరుణ కిరణమై బడుగువర్గాల కుడి భుజము తానై బానిసల వందేళ్లు బతికేకంటే వీరుడిలా ఒక్క క్షణం బ్రతికిన చాలని.. జీవచ్ఛవాలుగా ఉన్న మనుషుల్లో తన మాటతో పాటతో చైతన్యాన్ని నింపి.. పోరుబాటలో విప్లవ కాగడా తానై.. అలుపెరుగని యోధుడిలా ముందుండి దండు నడిపి బడుగువర్గాల బానిస సంకెళ్లను తెంచి ఆఖరి శ్వాస వరకు సమాజం కోసం బతికిన తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్.

ఈ రోజు ఆ మహనీయుని విగ్రహావిష్కరణ విజయవంతంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా లోని పటాన్ చేరు నియోజకవర్గం లోని తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజాయుద్ధనౌక గాదర్ కాస్యం విగ్రహాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. కాగా ఈ వేడుకలో మంత్రులు, మేధావులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో మాట్లాడిన కళాకారులు, మేధావులు గద్దర్ లాంటి కవి దేశంలో మరొకరు ఉండరని కొనియాడారు. అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ పైన ఉన్న కేసులను మాఫీ చేసుకున్నారు.. కానీ గద్దర్ పైన ఉన్న కేసులను మాఫీ చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ఈ కార్యక్రమం లో డిప్యూటీ సీఎం ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేడు గద్దర్ జయంతిని విజవంతంగా పురస్కరించుకున్నాం అని హర్షం వ్యక్తం చేసిన బట్టి విక్రమార్క గతం లో కూడా ఆ ప్రాంతంల్లో జరిగిన కార్యక్రమానికి తాను వచ్చినట్లు పేర్కొన్నారు. అప్పుడు గద్దర్ పేరు పైన మరికొన్ని కార్యక్రమాలు చేస్తామని.. విగ్రహాన్నిపెట్టతామని తాము ఇచ్చిన మాటను ఇప్పుడు నిలుపుకున్నట్లు తెలిపారు.

ఇక కిందిస్థాయి అధికారుల తప్పిదం వల్లనే 31 వ తేదీ జాగాల్సిన గద్దర్ విగ్రహ ప్రతిష్ట ఈ రోజు జరిగిందని తెలిపారు. ఇక గద్దర్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గద్దర్ పేరు పైన అవార్డులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహ ఆవిష్కరణ..

హైదరాబాద్ - పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజాయుద్ధనౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. pic.twitter.com/YNZ0rjVs5Y

— Telugu Scribe (@TeluguScribe) February 1, 2024

Advertisement

Next Story