Bandi Sanjay: రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ

by Gantepaka Srikanth |
Bandi Sanjay: రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు? అతని మతం ఏంటి?’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సంజయ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రాహుల్ కులం, మతం ఆయనకు కూడా తెలియదా అని ప్రశ్నించారు. రాహుల్ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని పేర్కొన్నారు. హిందూ సంప్రదాయంలో కులం తండ్రి ద్వారా వస్తుందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ నుంచి దారిమళ్లించేందుకు మరోరకంగా ప్రయత్నం మొదలు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కులంపై చర్చ కోరుతున్నారని పేర్కొన్నారు. ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో చర్చ చేయాలనుకుంటే జనపథ్ నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎంత ప్రయత్నించినా దృష్టి మళ్లించడం పనిచేయదని.. వాటన్నింటినీ అడ్డుకుంటామని హెచ్చరించారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed