- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ హామీలు నమ్మే వారికి ఫూల్స్ డే శుభాకాంక్షలు!
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను నమ్మితే ఫూల్స్ అవ్వడం ఖాయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్ వేశారు. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తామని చెప్పి కేసీఆర్ హామీ ఇచ్చారని ఆ హామీ ఇప్పటివరకూ నెరవేర్చలేదన్నారు. ‘ నిరుద్యోగ యువతకు రూ.3016 భృతి ఇస్తాం-సీఎం కేసీఆర్. మీరు దానిని విశ్వసిస్తే ఏప్రిల్ ఫూర్స్ డే శుభాకాంక్షలు!’ అంటూ శనివారం సెటైరికల్ ట్వీట్ చేశారు.
నిరుద్యోగ భృతితో ఊరించడం తప్ప వారిని ఈ ప్రభుత్వం ఆదుకోలేదని ధ్వజమెత్తారు. కాగా, 2018 ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి హామీ ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ హామీపై గతంలో అసెంబ్లీ వేదికగా స్పందించిన కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వాలనే సంకల్పం ఉంది. తప్పకుండా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. కరోనా కారణంగానే నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామని చెప్పారు. అయితే కరోనా పరిస్థితులు చక్కబడినా ఆదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం నిరుద్యోగులను నిరాశ పరుస్తోందని బీజేపీ మండిపడుతోంది.
ఇవి కూడా చదవండి: షర్మిల రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన ‘బండి’.. రేవంత్ ఒప్పుకోగానే రంగంలోకి!