- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్‌లో ఈ సారి బండి సంజయ్ ఓటమి ఖాయం: మాజీ MP పొన్నం ప్రభాకర్
దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగి నవీన్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నవీన్ కుంటుంబ సభ్యులను ఎవరూ కలవకుండా కేటీఆర్ మేనేజ్ చేశాడని ఆరోపించారు. ప్రభుత్వ పరిధిలోని ఐటీ విభాగం ఫెయిలైందన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నోటిఫికేషన్‌లు విడుదల చేసి, ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ విజయాలను ప్రభుత్వ విజయాలుగా గతంలో ప్రభుత్వం చెప్పుకున్నప్పుడు.. టీఎస్ పీఎస్సీలో జరిగిన తప్పు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
మంచి జరిగితే మీ ఖాతాలో? చెడు జరిగితే ఇతరుల ఖాతాలో వేస్తారా? అంటూ పొన్నం ప్రశ్నించారు. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయనున్నట్లు స్పష్టం చేశారు. బండి సంజయ్‌కు ఈ సారి ఓటమేనని ప్రభాకర్ జోస్యం చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండూ మోసపూరిత ప్రభుత్వాలేనని చెప్పారు. నవీన్ ఆత్మహత్యపై బీజేపీ స్టాండ్ ప్రకటించాలన్నారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన టెక్సైటైల్ పార్క్‌ను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో కేటీఆర్, ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.