Bandi Sanjay: నీరజ్ చోప్రాకు అభినందనలు తెలుపుతూ కేంద్రమంత్రి స్పెషల్ ట్వీట్

by Ramesh Goud |
Bandi Sanjay: నీరజ్ చోప్రాకు అభినందనలు తెలుపుతూ కేంద్రమంత్రి స్పెషల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒలంపిక్స్ లో ఇండియా నుంచి నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ.. స్పెషల్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో పారిస్ ఒలంపిక్స్ లో భారతదేశం యొక్క మొదటి రజత పతకాన్ని గెలుచుకున్నందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. అలాగే మీరు బంగారం కోసం ఉత్తమంగా ప్రయత్నించారని మాకు తెలుసు అంటూ.. మీ కృషి, అంకితభావం, సంకల్పం యావత్ దేశాన్ని గర్వించేలా చేశాయని కొనియాడారు. ఇక మీరు మునుముందు చాలా ఎత్తుకు ఎదుగుతూ ఉండాలని కోరుకుంటున్నానని బండి సంజయ్ ఎక్స్ లో రాసుకొచ్చారు.

కాగా పారిస్ ఒలంపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు. టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణం సాధించిన అతడు ఈ సారి కూడా గెలుచుకుంటాడని అనుకున్నారు. కానీ గురువారం జరిగిన ఫైనల్ మ్యాజ్ లో పాక్ కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం సాధించడంతో.. నీరజ్ 89.45 మీటర్లతో సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా పారిస్ ఒలంపిక్స్ లో భారత్ తరుపున తొలి రజత పతకాన్ని సాధించిన అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డు నమోదు చేసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed