- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bandi Sanjay: కేసీఆర్‌ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: కులగణన (Cast Census)కు తాము ఎంత మాత్రము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కరీంనగర్ (Karimnagar)లో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) అఖండ విజయం సాధించబోతోందని అన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తమ పార్టీనే గెలవబోతోందని.. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కూడా అర్ధమయ్యే మూడు జిల్లాల్లో హడావుడిగా ప్రచారం నిర్వహించారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయారు కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం తమకు అనుకూలంగా రాబోతుందని అన్నారు.
అదేవిధంగా బీసీ (BC)ల కులగణన తప్పులతడకగా సాగిందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు అని చెబుతోన్న సర్కార్ 32 శాతం మాత్రమే అమలు చేయలేనే కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. తాజాగా, నిర్వహించిన సమగ్ర సర్వేలో గతంలో కన్నా బీసీ (BC)లు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేకనే ప్రభుత్వం రీసర్వే (Resurvey) పేరుతో నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ (BC)లకు అన్యాయం చేసేందుకు సమగ్ర సర్వేను తీసుకొచ్చారని మండిపడ్డారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని.. ముస్లింలను బీసీల్లో కలిపి రిజర్వేషన్లు అమలు చేస్తామని చూస్తే అందుకు తాము ఒప్పుకోబోమని అన్నారు.
ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping) నత్తనడకన నడుస్తోందని కామెంట్ చేశారు. అసలు కేసీఆర్(KCR)ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదంటూ సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి ఢిల్లీ (Delhi)లోని హస్తం పార్టీ పెద్దలకు ఇప్పటికే ముడుపులు వెళ్లాయని ఆరోపించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)ను కాంగ్రెస్ సర్కార్ (Congress Government) మూలన పడేసిందని అన్నారు. మొన్న ఇండియా (India)-పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్ జరిగిందని అందులో భారత్ అద్భత విజయ సాధించిందని అన్నారు. అదేవిధంగా ఈనెల 27న కూడా రాష్ట్రంలో ఇండియా-పాక్ మ్యాచ్‌లాగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతోందని.. ఇండియా గెలవాలని కోరుకునే వారు బీజేపీ (BJP)కి ఓటు వేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.