Bandi Sanjay: గాలి, నీరు, నిప్పుతో పరిహాసం వద్దు.. వారికి బండి సంజయ్ కీలక పిలుపు

by Shiva |   ( Updated:2025-03-16 13:15:36.0  )
Bandi Sanjay: గాలి, నీరు, నిప్పుతో పరిహాసం వద్దు.. వారికి బండి సంజయ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా హోలీ (Holi) సంబురాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రంగుల పండుగ పీక్స్‌కు చేరింది. జనం అంతా రోడ్లపైకి వచ్చి ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీని ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) కరీంనగర్‌ (Karimnagar)లోని బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలు, కార్యకర్తలు అభిమానులతో కలిసి రంగుల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోలీ పండుగ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలు, హిందు (Hindu) బంధువులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశ వ్యాప్తంగా హోలీ పండుగను వైభవోపేతంగా జరుపుకుటున్నారని అన్నారు. ఎల్లప్పుడు హిందూ సమాజం ఓకే తాటిపై ఉండాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. ఆపద వచ్చినా.. హిందు ధర్మానికి అవమానం కలిగినా.. అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కులాలకు అతీతంగా అంతా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. పండుగ పూట గాలి, నీరు, నిప్పుతో పరిహాసం వద్దని.. స్నానాలు చేసేందుకు యువత చెరువులు, నదుల వెళ్లి ప్రాణాలు పొగొట్టుకోవద్దని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు కష్టాల్లో ఉన్నారని, అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ఆరోపించారు. పాలకుల నిర్లక్ష్యం, అహంకార ధోరణి, అబద్ధాలతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Next Story

Most Viewed