Nandamuri Balakrishna: సీఎం రేవంత్‌ రెడ్డితో బాలయ్య భేటీ.. అందుకోసమేనా..?

by Indraja |
Nandamuri Balakrishna: సీఎం రేవంత్‌ రెడ్డితో బాలయ్య భేటీ.. అందుకోసమేనా..?
X

దిశ వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని కలవలేదు.

గతంలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలకృష్ణ ఆ తరువాత ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు. దీనితో బాలయ్య రేవంత్ రెడ్డిని కలవలేకపోయారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో నేడు బాలకృష్ణ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం వారిరువురూ ఏపీ రాజకీయాల గురించి కాసేపు ముచ్చటించుకున్నట్లు సమాచారం.

అలానే సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలను సైతం రేవంత్ రెడ్డి బాలకృష్ణను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కాగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పన కోసం గతం ప్రభుత్వహయాంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యం ధరఖాస్తు చేసుకుంది. కాగా ఆ ధరఖాస్తును త్వరలోనే ఆమోదిస్తామని రేవంత్ రెడ్డి బాలకృష్ణకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story