ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరికి బెయిల్​..

by Vinod kumar |   ( Updated:2023-05-15 14:38:20.0  )
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరికి బెయిల్​..
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు సోమవారం మరో ఇద్దరికి బెయిల్​మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు బెయిల్​పొందిన వారి సంఖ్య అయిదుకు చేరింది. టీఎస్పీఎస్సీ బోర్డులో అసిస్టెంట్​సెక్షన్​ఆఫీసర్​గా ఉన్న ప్రవీణ్​కుమార్​నెట్ వర్క్​ఇంఛార్జీ రాజశేఖర్​రెడ్డితో కలిసి కాన్ఫిడెన్షియల్​రూంలో ఉన్న కంప్యటర్​నుంచి వేర్వేరు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను తస్కరించిన విషయం తెలిసిందే. దీంట్లో ఏఈఈ సివిల్, జనరల్​నాలెడ్జ్​పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ప్రవీణ్​తనకు పరిచయం ఉన్న గురుకుల టీచర్ ​రేణుకకు విక్రయించాడు.

రేణుక వాటిని తన భర్త లద్యావత్​డాక్యానాయక్​కు ఇవ్వగా అతను తన బావమరిది రాజేశ్వర్​నాయక్​కు ఇచ్చాడు. ఈ ఇద్దరు ప్రశ్నాపత్రాలను వేర్వేరు వ్యక్తులకు విక్రయించారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్​ప్రధాన నిందితుడు ప్రవీణ్​కుమార్, రాజశేఖర్​రెడ్డి, రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్​నాయక్​తోపాటు పలువురు నిందితులను ఈ కేసులో అరెస్టు చేసింది. తాజాగా అరెస్టయిన డాక్యానాయక్, రాజేశ్వర్​నాయక్​లకు బెయిల్​మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు యాభైవేల రూపాయల చొప్పున రెండేసి పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని సూచించింది.

Also Read...

సీబీఐ వస్తే దొరికిపోతామని సిట్‌తో సైలెంట్‌గా సెట్!

Advertisement

Next Story

Most Viewed