సీఎం జగన్తో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

by Javid Pasha |
సీఎం జగన్తో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
X

దిశ, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం శాసనసభ్యుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలు మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీయం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ది పనుల గురించి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా మెట్ట నియోజకవర్గాలకు మేలు చేకూరేందుకు నిర్మిస్తున్న హైలెవల్ కెనాల్ ఫేజ్ 1 & 2 పనులకు సంబంధించి మునక ప్రాంత రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు నష్ట పరిహారం చెల్లింపు విషయమై నెల్లూరు జిల్లా కలెక్టర్ కు తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆత్మకూరు నియోజకవర్గానికి అవసరమైన పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి విన్నవించినట్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed