Arekapudi Gandhi: కౌశిక్‌రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ.. పరిస్థితి మరింత ఉద్రిక్తం, పలువురు అరెస్ట్

by Shiva |   ( Updated:2024-09-12 10:26:29.0  )
Arekapudi Gandhi: కౌశిక్‌రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ.. పరిస్థితి మరింత ఉద్రిక్తం, పలువురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నంత పని చేశారు. చేసిన సవాలు మేరకు ఆయన కొండాపూర్‌లోని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనను మార్గమధ్యలో గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నా.. ఎట్టకేలకు కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే గేట్లు తెరిచి ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు గేటును మూసివేసి బారికేడ్లు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ క్రమంలో కార్యకర్తలను పోలీసులు అదుపు చేయలేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురవ్వగా పరిస్థితి మరింత ఉద్రక్తంగా మారింది. ఈ క్రమంలో ఇరు పార్టీ నాయకులు మధ్య తోపులాట జరిగి గుడ్లు, టమాటాలు, చెప్పులతో పరస్పరం దాడికి దిగారు. మరోవైపు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా అరికేపూడి గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గేటు దూకేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read more : కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి

Advertisement

Next Story