ఫ్రీ బస్సు నీ ఇంట్లకెళ్ళి ఇస్తున్నావా దున్నపోతు మొఖందాన..ఆడాళ్లా మజాకా

by Indraja |
ఫ్రీ బస్సు నీ ఇంట్లకెళ్ళి ఇస్తున్నావా దున్నపోతు మొఖందాన..ఆడాళ్లా మజాకా
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు భరోసా కల్పిస్తూ రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేశారు. అయితే ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుండి ఎక్కడో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందులో కొన్ని తీవ్రంగా ఉంటే.. మరికొన్ని కామెడీగా ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఓ ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది.

బస్సులో లేడీ కండక్టర్ ఉచిత ప్రయాణం టికెట్ తీసుకోవాలని ఓ మహిళను కోరింది. అయితే ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ ఇరువురు ఒకరినొకరు పొల్లుపొల్లు తిట్టుకున్నారు. నీ ఇంట్లకెళ్లి ఇస్తున్నావా ఫ్రీ బస్సు అని ప్రయాణికురాలు కండక్టర్ పై ఫైర్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ప్రయాణికురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది కండక్టర్.

ఇక అంతే ఏంటి అలా ఒర్రుతున్నావ్ గాడిద లెక్క అని ప్రయాణికురాలు మండిపడగా.. మనిషిలేక్క మాట్లాడమని కండక్టర్ అన్నారు. దానికి ఆ మహిళా నువ్వు మాట్లాడుతున్నావ్ దున్నపోతులెక్క, దున్నపోతు మొఖందాన అని తిడుతూ.. ముందు అక్కడ ఉందని.. టికెట్ ఎలా తీసుకుంటారని.. తోటి ప్రయాణికులతో చెప్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముందు నువ్వు ఏం మాట్లాడవు, ఉద్యగం చేసేటప్పుడు నిదానంగా ఉండాలి, ఇప్పుడే బస్సు ఎక్కాను, ఇప్పుడే బస్సు దిగను కదా తీసుకుంటాను కదా అని వెల్లడించారు. అందుకు కండక్టర్ ఎక్కిన వెంటనే టికెట్ తీసుకోవాలి.. అక్కడికి వెళ్ళాక తీసుకుంటాను అంటే కుదరదు అని అన్నారు. అందుకు మహిళ బస్సు ఆపు కాకి మొఖందాన, మళ్లీ మాట్లాడుతున్నావ్ అని తిట్టారు.

పక్కన ఉన్న ఓ వ్యక్తి అలా అనవద్దని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ముందు తాను ఎక్సట్రాలు మాట్లాడిందంటే.. తానే మాట్లాడిందని ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఇరువురి అరుపులకు బస్సులోని పసిపాప బయపడి ఏడ్చింది. కాగా తోటి ప్రయాణికులు ఎవరో ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.


Advertisement

Next Story