ఇలాంటి వాటర్ కొనుక్కొని తాగుతున్నామా!.. ఇది ఎక్కడో తెలుసా?

by Disha Web Desk 5 |
ఇలాంటి వాటర్ కొనుక్కొని తాగుతున్నామా!.. ఇది ఎక్కడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేసవికాలం ఎండల తీవ్రత కారణంగా భూగర్భ జలాలు అడుగంటి హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు హైదరాబాద్ నివాసులు జీహెచ్ఎంసీ సప్లై చేసే నీటి ట్యాంకులను కొనుగోలు చేసుకొని తమ ఇంటి సంపుల్లో నింపుకుంటారు. ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రం అవ్వడంతో నీటి కొరత ఎక్కువగా ఉంది. దీనినే ఆసరాగా చేసుకొని కొందరు వాటర్ సప్లై ట్యాంకర్ యజమానులు విచ్చలవిడిగా డబ్బు సంపాదిస్తున్నారు. నివాసులకు మురికి నీటిని సైతం సప్లై చేసిన ఘటనలు ఈ మధ్యకాలంలో జరిగాయి. ఈ నేపధ్యంలోనే ఓ వాటర్ ట్యాంకర్ లో మురికి నీటిని నింపుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇది నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నట్లు ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఓ ఫ్లైఓవర్ పక్కన బ్రిడ్జిపై ట్రాక్టర్ ఆపి నాళాల్లోనుంచి వచ్చే నీటిని వాటర్ ట్యాంకులోనికి నింపుతున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ ట్రాక్టర్ వాటర్ ట్యాంక్ పై సీబీఆర్ వాటర్ సప్లయి అని రాసుంది. దీనిపై జీహెచ్ఎంసీ కమీషనర్, సైబరాబాద్ పోలీసులు, నర్సింగి పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ వ్యక్తి కోరాడు. ఇది చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి వాటర్ ఉపయోగిస్తే చిన్నపిల్లల పరిస్థితి ఏంటి?, నింపే వాళ్లు ఆ వాటర్ ఉపయోగిస్తారా? ఇలాంటి వాటిపై జీహెచ్ఎంసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed