తాగుబోతుల సంఘం విజ‌యం.. అందుబాటులోకి వచ్చిన బీర్లు

by Nagaya |
తాగుబోతుల సంఘం విజ‌యం.. అందుబాటులోకి వచ్చిన బీర్లు
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో : తాగుబోతుల సంక్షేమ సంఘం చేసిన పోరాటం ఫ‌లించింది. ఎట్టకేల‌కు వైన్ షాప్‌లు, బార్లలో కింగ్ ఫిష‌ర్ బీర్ల స్టాక్ అధికారులు తెచ్చిపెట్టారు. దీంతో ప‌లువురు తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి త‌రుణ్‌కు స‌న్మానం చేశారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే మంచిర్యాల జిల్లాతో పాటు ప‌లు చోట్ల కింగ్ ఫిష‌ర్ లైట్ బీర్లు దొర‌క‌డం లేద‌ని, దీంతో త‌మ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయ‌ని తాగుబోతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ సూప‌రింటెండెంట్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. స్ట్రాంగ్ బీర్ల వ‌ల్ల ఆరోగ్యాలు పాడుతున్నాయ‌ని, అందుకే కింగ్‌ఫిష‌ర్ లైట్ బీర్లు అందుబాట‌లో ఉంచాల‌ని కోరారు. తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి త‌రుణ్ పాద‌యాత్రగా వెళ్లి అధికారుల‌కు విన‌తిప‌త్రం ఇవ్వడంతో అధికారులు స్పందించి ఆ బీర్లను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప‌లువురు తాగుబోతులు కొట్రంగి త‌రుణ్‌కు మంగ‌ళవారం స‌న్మానం చేశారు.

Advertisement

Next Story