- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేడారం జాతరకు నోడల్ అధికారుల నియామకం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతరకు నోడల్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. ఆర్వీ కర్ణన్, కృష్ణ ఆదిత్య, ఆదర్శ్ సురభి, ప్రతిమా సింగ్, రాధికా గుప్తలకు ప్రభుత్వం జాతర బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరుగనుంది.
ఇప్పటికే ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు మంజూరు చేయగా.. కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించింది. మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు నిత్యం అక్కడే ఉండి జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక బస్సులు కేటాయించారు. కొత్తగా హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.