Kavitha: ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగిస్తే మరో పోరాటం తప్పదు: కవిత

by Prasad Jukanti |   ( Updated:2024-12-12 11:56:04.0  )
Kavitha: ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగిస్తే మరో పోరాటం తప్పదు: కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ విషయంలో తమకు నిర్దిష్టమైన సమాచారం ఉందని అదే జరిగితే మరో పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఆశా వర్కర్ల ఆందోళనలపై గురువారం ఎక్స్ లో పోస్టు చేసిన కవిత.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆశావర్కర్లు ఆందోళన చేస్తున్నారన్నారు. విధుల నుంచి తొలగించాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed