- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్‌లో కవిత లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు ప్రతివాదులకు (ఈడీ) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఈ నెల 15వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ మోపిన క్రిమినల్ అభియోగాలను క్యాష్ చేసి.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు.
Read More..
పదేళ్లు ఫ్రెండ్లీ పార్టీ.. అయినా కవిత అరెస్ట్‌పై MIM సైలెంట్ వెనక స్కెచ్ ఇదేనా..!