బిగ్ బ్రేకింగ్: RRR మూవీ టీమ్‌తో అమిత్ షా భేటీ రద్దు!

by Satheesh |
బిగ్ బ్రేకింగ్: RRR మూవీ టీమ్‌తో అమిత్ షా భేటీ రద్దు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన శంషాబాద్‌కు చేరుకుంటారు. ఈ మేరకు మార్పులకు సంబంధించి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. కర్ణాటక ఎన్నికలు, ఇతర ముఖ్య కార్యక్రమాలు ఉండడంతో ఆలస్యంగా అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. షా షెడ్యూల్ ఆలస్యం కారణంగా తొలుత పేర్కొన్న కార్యక్రమాలు పూర్తిగా రద్దయ్యాయి. తొలుత ట్రిపుల్ ఆర్ టీమ్‌తో అమిత్ షా భేటీ అవుతారని చెప్పినా ఆలస్యంగా వస్తుండటంతో రద్దయింది.

అంతేకాకుండా నొవాటెల్‌లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం సైతం రద్దయినట్లుగా సమాచారం. అంతేకాకుండా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన నేతలతో భేటీ కూడా ఉండకపోవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా సభకు మాత్రం అనుకున్న సమయానికి అమిత్ షా హాజరుకానున్నారు. ఆదివారం సాయంత్ర 5 గంటలకు శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభ ప్రాంగణానికి షా చేరుకుంటారు. ఆపై గంట పాటు సభలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా కర్ణాటకకు వెళ్లనున్నారు.

Advertisement

Next Story