- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూలై 3 నుంచి అంబేద్కర్ వర్సిటీ పీజీ పరీక్షలు
దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) పరీక్షలు జూలై 3 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి. వెంకట రమణ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పీజీ (ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్), ఎంకాం, ఎంఎస్సీ (మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ), ఎం.బీ.ఏ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (ఎంఎల్ఐఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (బీఎల్ఐఎస్సీ), అన్ని డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.
పరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఫీజును టీఎస్, ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్‌తో మాత్రమే చెల్లించాలని తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జూన్ 2 అని, పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ పోర్టల్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు వారి సంబంధిత అధ్యయన కేంద్రంలో లేదా విశ్వవిద్యాలయ కాల్ సెంటర్ 18005990101 లేదా హెల్ప్ డెస్క్ 7382929570 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
స్పెషలిస్ట్, ఎంటీఎస్ పోస్టులు.. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం