అల్లు అర్జున్ జైలుకు పోవడం ఖాయం.. అడ్వకేట్ పోడూరి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
అల్లు అర్జున్ జైలుకు పోవడం ఖాయం.. అడ్వకేట్ పోడూరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) మళ్లీ జైలుకు పోవడం ఖాయం అని అడ్వకేట్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి(Advocate Poduri Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theatre Stampade) ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట ఘటనపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ.. అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్వకేట్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ప్రెస్ క్లబ్(Hyderabad Press Club) లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాటపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యి.. జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. ఆయనకు బెయిల్ కొద్ది రోజులకు మాత్రమే వచ్చిందని, అది కూడా మరో రెండు, మూడు రోజుల్లో రద్దు అవుతుందని అన్నారు. బెయిల్ రద్దు అయితే అల్లు అర్జున్ మళ్లీ జైలుకు పోవడం ఖాయమని అడ్వకేట్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed