Alleti Maheshwar Reddy: ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి.. ఎమ్మెల్యే ఏలేటి కీలక వ్యాఖ్యలు

by Shiva |
Alleti Maheshwar Reddy: ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి.. ఎమ్మెల్యే ఏలేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కులగణన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ శాసన‌సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని బీజేపీ (BJP) ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కులగణనకు బీజేపీ (BJP) వ్యతరేకం కాదని తెలిపారు. గతంలో కేసీఆర్ (KCR) సకల జనుల సర్వే (Sakala Janula Survey) పేరుతో హంగామా చేశారని ఫైర్ అయ్యారు. కనీసం రిపోర్టును కూడా బయటపెట్టలేదని ఎద్దేవా చేశారు. నేడు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ కులగణనకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. కామారెడ్డి (Kama Reddy) బీసీ డిక్లరేషన్ (BC Declaration) సభలో ఇచ్చిన 21 హామీల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. మంత్రి వర్గంలో బీసీల సంఖ్య చూస్తేనే ఆ విషయం అర్థం అవుతుందని కామెంట్ చేశారు. కులగణనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story