బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దోస్తీ ఉందా.. లేదా? ఆ పార్టీ మాత్రం అప్రమత్తమైంది

by Ramesh N |
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దోస్తీ ఉందా.. లేదా? ఆ పార్టీ మాత్రం అప్రమత్తమైంది
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పాలిటిక్స్ చర్చ ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్‌, బీజేపీ రహస్యంగా దోస్తీ ఉందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి ఆరోపిస్తున్నది. తాజాగా లోక్‌సభ ఎన్నికలకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పాలిటిక్స్ రాష్ట్రంలో మరోసారి చర్చానీయాంశంగా మారింది. ప్రజల్లోకి కూడా ఈ టాపిక్ బలంగా వెళ్లినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. దీంతో బీజేపీ పార్టీ అప్రమత్తమైంది. దీంతో పొత్తు టాపిక్ నుంచి బయటపడాలని బీజేపీ భావిస్తోంది. గతంలో పొత్తులపై అంతగా మాట్లాడని బీజేపీ పార్టీ నేడు గట్టిగానే స్పందించింది.

అసలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దోస్తీ ఉందా..? లేదా?

బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తాజాగా పొత్తులపై మరోసారి స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. తెలంగాణకు ఇక ఆ పార్టీ అవసరం లేదని, పదేళ్లుగా ఆ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. కాగా, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అసలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దోస్తీ ఉందా..? లేదా? ఈ పొత్తు లీకుల వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అనే ప్రశ్నలు నేడు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజల్లో మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ రహస్య పొత్తు ఉందనే బలంగా నమ్ముతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. దీంతో అప్రమత్తమైన బీజేపీ నష్ట నివారణ తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed