Group-2 Exam: గ్రూప్-2 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్.. ఎడిట్‌ ఆప్షన్‌కు అవ‌కాశం..

by Ramesh N |
Group-2 Exam: గ్రూప్-2 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్.. ఎడిట్‌ ఆప్షన్‌కు అవ‌కాశం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గ్రూప్ -2 అభ్యర్థులకు సంబంధించి టీజీపీఎస్సీ తాజాగా కీలక ప్రకటన చేసింది. త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. దరఖాస్తులో ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే, లేదా ఇతర వివరాలు సరి చేయాలనుకుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి.. చివరి తేదీ ఈ నెల 20న సాయంత్రం 5 గంటల వరకు అని పేర్కొంది.

ఎడిట్‌కు ఇదే చివరి అవకాశం అని, భవిష్యత్‌లో మరో అవకాశం ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల అభ్యర్థులు ఈ సమయంలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని సూచించారు. ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకునే అభ్యర్థులు ఎస్ఎస్‌సీ, ఆధార్ కార్డుకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ద‌ర‌ఖాస్తుల ఎడిట్ పూర్త‌యిన త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా త‌మ ద‌ర‌ఖాస్తును పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని పేర్కొంది. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story