- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆమెను ఎవరూ ఏమీ అనలేదు.. అభియోగం మాత్రమే: బొత్స

X
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీలో నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari)పై ఎవరూ అసభ్యకర కామెంట్ చేయలేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(YSRCP MLC Botsa Satyanarayana) అన్నారు. వైఎస్ భారతి(YS Bharti)పై చేబ్రోలు కిరణ్(Chebrolu Kiran) అనుచిత వ్యాఖ్యలు, అరెస్ట్ నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇతరులపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా అది తప్పేనని బొత్స వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో చంద్రబాబు బాధపడ్డారని, ఆ రోజు కూడా ఖండించామని తెలిపారు. రికార్డెడ్‌గా భువనేశ్వరిని ఎవరూ అనలేదని, ఆ విషయం అదే రోజే చెప్పామని పేర్కొన్నారు. భువనేశ్వరిని అన్నారనేది అభియోగం మాత్రమే, అయినా తప్పుబట్టామన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సంఘ బహిష్కరణ చేయాలని బొత్స డిమాండ్ చేశారు.
Also Read..
పవన్ డిప్యూటీ CM కావడం ఏపీ ప్రజల దురదృష్టం.. MLC కవిత సంచలన వ్యాఖ్యలు
Next Story