రైతు బీమా కొత్త దరఖాస్తులను అప్ లోడ్ చేయండి.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

by Javid Pasha |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతు బీమాకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో వెంటనే నూతనంగా వచ్చిన ధరఖాస్తులను అప్ లోడ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖా మంత్రి పేషీ నుండి అన్ని జిల్లాల డీఎఓ, డీహెచ్ ఎస్ఓ, ఇతర అధికారులతో అయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..సేంద్రీయ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులను మరింత ప్రోత్సహించాలని నేల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దిశగా రైతాంగాన్ని మరింత చైతన్యం చేయాలనీ అధికారులకు ఆదేశించారు. పంటల సాగు వివరాలు వెంటనే తెలియజేయాలని సూచించారు.

వరి, కంది, పంటలు ఈ నెలాఖరు వరకు, మిరప సెప్టెంబరు మొదటి వారం వరకు సాగు చేసుకోవడానికి అవకాశం వుందని ఈ సీజన్ కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 83 లక్షల ఎకరాలలో వ్యవసాయ పంటలు, 7.50 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగయ్యాయన్నారు. వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని అలాగే రైతులు ఆయిల్ పామ్ సాగును చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, అగ్రోస్ ఎండీ రాములు, ఏడీడీ విజయ్ కుమార్, ఉద్యానశాఖ జేడీ సరోజిని తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed