- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పదేళ్లు దోచుకొని ఇప్పుడు సుద్దపూస మాటలా.. హరీష్ రావుకు బీర్ల ఐలయ్య స్ట్రాంగ్ కౌంటర్

దిశ, వెబ్ డెస్క్: హరీష్ రావు తెలంగాణను పదేళ్లు దోచుకొని ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా మారకపోతే ప్రజలు బుద్ది చెబుతారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Government Whip Beerla Ailaiah) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న పాలనపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (AICC Leader Rahul Gandhi)కి బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader harish Rao) లేఖ రాశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఐలయ్య.. హరీష్ రావు పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావు మాటలు వింటుంటే నవ్వాలా ఏడవాలా అర్ధం కావడం లేదని, పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకొని, ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ లో ఉండగా సోనియాగాంధీ (Sonia Gandhi) ఇచ్చిన తెలంగాణను పదేళ్లు దోచుకున్న నీకు రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత లేదని అన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ గర్వించదగ్గ పాలన చేస్తున్నారని తెలిపారు.
రాహుల్ గాంధీకి, హరీష్ రావుకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, పేదల సంక్షేమం కోసం ప్రధాని పదవిని సైతం పక్కన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానిది అయితే, సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను పదేళ్లలో భ్రష్టు పట్టించిన చరిత్ర మీదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు రాహుల్ గాంధీ కి లేఖ రాయడం చూస్తుంటే వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక మీరు మీ పింక్ సోషల్ మీడియాల ద్వారా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టినా.. మీ వక్రబుద్ది మారలేదని అన్నారు. ప్రజా పాలన చూసి కడుపు మండి నీచ రాజకీయాలు చేస్తే, ప్రజలు మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఇప్పటికైనా బుద్ది మార్చుకొని ప్రతిపక్ష హోదా సక్రమంగా నిర్వహించి, ప్రభుత్వానికి విలువైన సలహాలు అందించాలని బీర్ల ఐలయ్య కోరారు.